హాట్ టాపిగ్గా తెలుగు స్టేట్స్ లో “అవతార్ 2” సెన్సేషన్.!

హాట్ టాపిగ్గా తెలుగు స్టేట్స్ లో “అవతార్ 2” సెన్సేషన్.!

Published on Dec 17, 2022 8:00 AM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ని అయితే మరోసారి మంత్రముగ్ధులని చేసిన బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ “అవతార్ 2”. హాలీవుడ్ ఆల్ టైం టాప్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం సాలిడ్ విజువల్ అండ్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కి రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది.

ఇక ఇదిలా ఈ చిత్రం తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాగా ఇప్పుడు తెలుగు స్టేట్స్ ఓపెనింగ్స్ కానీ తెలుగులో ఈ సినిమాకి వస్తున్న ఆదరణ గాని నేషనల్ వైడ్ సినిమా దగ్గర హాట్ టాపిక్ గా మారాయి. ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన గ్రాస్ లో చాలా వరకు అయితే మన తెలుగు నుంచే చాలా వరకు వచ్చినట్టుగా తెలుస్తుంది.

అలాగే సౌత్ ఇతర రాష్ట్రాల్లో అత్యధిక కాంట్రిబ్యూషన్ కూడా తెలుగు నుంచే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. దీనితో అయితే అవతార్ 2 సెన్సేషన్ మాత్రం మన తెలుగు మూవీ లవర్స్ దెబ్బకి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు