తెలుగు రాష్ట్రాల్లో భారీ ధరకు “ఆదిపురుష్” థియేట్రికల్ రైట్స్!

Published on May 28, 2023 5:34 pm IST


రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడిగా, డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో అర్ధం అయ్యింది.

ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ ఏర్పడింది. జూన్ 16 వ తేదీన విడుదల కి సిద్ధం అవుతున్న ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ ను దాదాపు 170 కోట్ల రూపాయల కి దక్కించుకున్నట్లు తెలుస్తుంది. నైజాం ఏరియా వరకే 80 కోట్ల రూపాయల వరకు డిమాండ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో జరుగుతుండటం తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :