క్రేజీ..సీసీఎల్ ఫైనల్స్ లో అడుగు పెట్టిన టాలీవుడ్ టీం.!

Published on Mar 25, 2023 7:05 am IST

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా దగ్గర అన్ని సినిమా పరిశ్రమలకు సంబంధించి సీసీఎల్(సెలెబ్రెటీ క్రికెట్ లీగ్) జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ లీగ్ లో మన టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ మొదటి ఆట నుంచి కూడా చాలా సీరియస్ గా సత్తా చాటుతూ వరుస విజయాలతో అదరగొడుతున్నారు. మరి అలా నిన్న సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్న తెలుగు వారియర్స్ నిన్న కర్ణాటక బుల్ డోజర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అయితే విజయకేతనం ఎగరేసి ఫైనల్స్ కి చేరుకుంది.

మరి మొదటి ఇన్నింగ్స్ లో కర్ణాటక 99 తెలుగు వారియర్స్ 95 పరుగులతో వెనుకంజ లో ఉండగా నెక్స్ట్ రెండో ఇన్నింగ్స్ లో కర్ణాటక 98 పరుగులు చేయగా తెలుగు వారియర్స్ 105 పరుగులతో ఇంకా కొన్ని బాల్స్ ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చెయ్యడం విశేషం. మరి ఈ మ్యాచ్ లో థమన్ విన్నింగ్ షాట్ అయితే వైరల్ గా కూడా మారింది. ఇక ఫైనల్స్ లో అయితే ఆల్రెడీ భోజ్ పూరి టీం ఉండగా దానితో తెలుగు వారియర్స్ ఈ మార్చ్ 25 న వైజాగ్ వేదికగా తలపడనుంది. దీనితో మొత్తానికి ఏజెంట్ అఖిల్ సారధ్యంలో అయితే మరోసారి మనకి కప్ వచ్చేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :