ఎన్టీఆర్ సినిమా రీమేక్లో హీరో కుదిరాడు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక భిన్నమైన సినిమాగా నిలిచి, నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘టెంపర్’. అప్పటి వరకు వరుస పరాజయాల్లో ఉన్న ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

నటుడు, నిర్మాత అయిన సచిన్ జోషి ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని దక్కించుకోగా స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఇందులో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తారని, దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తారని బీ-టౌన్ లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. మరి వార్తా ప్రకారమే ప్రాజెక్ట్ ముందుకు వెళితే ఎన్టీఆర్ కు మంచి హిట్ గా నిలిచినా ఈ ‘టెంపర్’ రణ్వీర్ సింగ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.