బేగంపేట్ లో సందడి చేస్తున్న టెంపర్ టీం

Temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ డిసెంబర్ 27న మొదలైంది. ప్రసతుతం ఈ సినిమా షూటింగ్ బేగంపేట్ లోని గులాబి హౌస్ లో వేసిన పోలీస్ స్టేషన్ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాధ్ ఎన్.టి.ఆర్, ఇతర నటీనటులపై వచ్చే షూట్ చేస్తున్నారు. అక్కడే ఒక కోర్ట్ రూం సెట్ కూడా వేసారు. అందులో కూడా కొన్ని సీన్స్ ని షూట్ చేయనున్నారు.

ఈ ఫైనల్ షెడ్యూల్ తో దాదాపు సినిమా మొత్తం పూర్తవుతుంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచే తక్కువ టైంలో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ అది కుదరక పోవడంతో ఈ చిత్ర టీం ఫిబ్రవరి మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version