అన్ని కోట్ల వసూళ్లు సాధించడం అంటే గ్రేటే !

Published on Dec 12, 2021 10:51 pm IST


బాలయ్య బాబు అఖండ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా అటు యూఎస్ లో సైతం భారీ వసూళ్లను సాధిస్తుండటం విశేషం. అసలు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లు బోసిపోయాయి. అయితే, మళ్ళీ థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఒక్క బాలయ్య ‘అఖండ’కే దక్కింది.

విడుదలైన మొదటి రోజు నుంచీ అఖండకు ప్రేక్షక లోకం బ్రహ్మరథం పడుతూనే ఉంది. దాంతో అఖండ సినిమా అన్నీ చోట్ల విశేష ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. దాంతో ఈ సినిమా పది రోజుల్లోనే రూ. 100 కోట్లు (గ్రాస్‌ వసూళ్లు) కలెక్ట్‌ చేసి మొత్తానికి బాలయ్య కెరీర్ లోనే ఘనమైన సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌ లో స్పెషల్‌ షోలు లేకపోయినా, అలాగే పరిమిత టికెట్‌ ధరలనే పెట్టినా ఇన్ని కోట్ల వసూళ్లు సాధించడం అంటే నిజంగా గ్రేటే అంటూ సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :