నవంబర్ 15న ‘తెనాలి రామకృష్ణ ‘ !

Tenali

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. కాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ ను ఈ రోజు తెనాలి సంగ‌మేశ్వ‌ర సినిమాస్ థియేట‌ర్‌ లో విడుద‌ల చేశారు. నవంబర్ 15న ఈ సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు.

ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం ఈ కామెడీ సినిమా చేస్తున్నాడట. మళ్లీ ఈ సినిమానే చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ సినిమా.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇది అతనికి 75వ చిత్రం కావడం విశేషం. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది

Exit mobile version