మలయాళం కొత్త ఇండస్ట్రీ హిట్ ‘బెత్లెహం కుటుంబ యూనిట్’ ఓటిటి డేట్ లాకయిందా?

రీసెంట్ గా మలయాళ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన రోమ్ కామ్ చిత్రం ‘బెత్లెహం కుటుంబ యూనిట్’ కూడా ఒకటి. టాలెంటెడ్ హీరో నివిన్ పౌలీ హీరోగా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న యువ హీరోయిన్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గిరీష్ ఏ డి తెరకెక్కించిన ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ దగ్గర 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ సాలిడ్ లాంగ్ రన్ చూసిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు టాక్. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించారు. అలాగే ఫహద్ ఫాజిల్ నిర్మాణం వహించారు.

Exit mobile version