టెన్త్ క్లాస్ డైరీస్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఫన్, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సాగుతుంది – దర్శకుడు గరుడావెగా అంజి

టెన్త్ క్లాస్ డైరీస్ అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఫన్, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సాగుతుంది – దర్శకుడు గరుడావెగా అంజి

Published on Jun 28, 2022 3:55 PM IST

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ‘గరుడావెగా అంజి’ తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. ఈ మూవీలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీరామ్ హీరోగా యాక్ట్ చేసారు. ఎస్ ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్స్ పి. రవితేజ, అచుత రామారావు సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించి అవి మూవీ పై వారిలో బాగా హైప్ క్రియేట్ చేసాయి. ఇక రేపు ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ మూవీకి సంబందించి తన అనుభవాలు పంచుకున్నారు దర్శకుడు అంజి.

 

టెన్త్ క్లాస్ డైరీస్ ఎటువంటి జానర్ సినిమా … అసలు కథాంశం ఏంటి … ??

నిజానికి ఈ సినిమా మా నిర్మాతలైన అచ్యుత రామారావు, ఆయన స్నేహితుల జరిగిన వాస్తవ కథ. అయితే వారు ఆ ఘటనలు చెప్పిన తరువాత దానిని పూర్తి స్థాయి కథగా రూపొందించి, ఆపైన స్క్రీన్ ప్లే రాసుకున్నాను. ఇక ఈ మూవీ అందరినీ ఆకట్టుకునే సోషల్ జానర్ సినిమా. అలానే సినిమా ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది, అలానే మూవీలో మంచి ఆకట్టుకునే యాక్షన్, ఎమోషనల్ అంశాలు ఉన్నాయని, తప్పకుండా మూవీ చూసిన తరువాత ప్రేక్షకులకి ఇది బాగా కనెక్ట్ అవుంతుందనే నమ్మకం ఉంది.

 

స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన మీరు, దర్శకుడు ఎందకు కావాలనుకున్నారు …??

వాస్తవానికి నాకు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన లేదు. అయితే గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ లో రెండు సినిమాలకు కెమెరా మ్యాన్ గా పనిచేసిన అనుభవం కలిగిన నాకు, మధ్యలో పలు సందర్భాల్లో నిర్మాత తమ లైఫ్ లో చూసిన ఒక అమ్మాయి ప్రేమించిన వ్యక్తి కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయిన కథ నన్ను ఆకట్టుకుంది, దానికి దృశ్యరూపకం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ మూవీ స్టోరీ, స్క్రిప్ట్ రాసుకున్నాను, ఆపైన దీనితోనే దర్శకుడిగా మెగాఫోన్ పట్టాను. దీని అనంతరం మలయాళంలో ఒక మూవీ చేయబోతున్నాను.

 

సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అవడం వలన ఏదైనా ఉపయోగం ఉందంటారా …. ??

నిజానికి నేను ఇప్పటివరకు 50 వరకు సినిమాలకు ఫోటోగ్రాఫర్ గా పనిచేసాను. అందులో మొత్తంగా 40 మంది దర్శకుల వద్ద పనిచేసిన నాకు, వారి విజన్ కి తగ్గట్లుగా ఆయా మూవీస్ ని ఇలా చూపించాలి, అలా చూపించాలి అనే ఆలోచన రావడం, ఆపైన అవి సదరు దర్శకులకి కూడా బాగా కనెక్ట్ రావడంతోనే నాకు కూడా ఒకింత డైరెక్షన్ చేయగలనే నమ్మకం కొంత కలిగింది. అనంతరం ఈ కథ విన్న నాకు న్యాయం చేయగలనే భావన కలగడం, నిర్మాతలు కూడా నామీద నమ్మకం పెట్టుకోవడం దీనిని సినిమాగా తీసేందుకు ముందుకు నడిపింది. ఇక దర్శత్వా శాఖలో దివంగత దాసరి నారాయణరావు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ల వద్ద శిష్యరికం చేసిన అనుభవం కొంత నాకు ఇక్కడ ఉపయోగపడింది.

 

మరి ఈ మూవీకి డైరెక్షన్, ఫోటోగాఫి రెండూ మీరే చేయాలనిపించిందా …. ??

వాస్తవానికి కథ సిద్ధం చేసుకుని డైరెక్షన్ చేద్దాం అనుకున్న నాకు, దీనికి కెమెరా మ్యాన్ గా కూడా వ్యవహరించడం ఒకింత ఇబ్బందిని కైగిస్తుందేమో అనిపించింది. అయితే అదే సమయంలో నిర్మాతలతో పాటు యావత్ టీమ్ మొత్తం కూడా నాకు ఎంతో సహకరించడంతో ఆ పని భారం నాకు పెద్దగా తెలియలేదు.

 

‘గరుడావెగా’ మూవీ మీ జీవితంలో ఎటువంటి ప్రభావం చూపింది… ??

యావత్ నా లైఫ్ లోనే పెద్ద టర్నింగ్ పాయింట్ అది. ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అంతర్మ నా పేరు ముందు గరుడావెగా అనే పేరు చేర్చబడింది. అక్కడి నుండి అందరూ గరుడావెగా అంజి అంటే చాలు ఇట్టె గుర్తుపడుతున్నారు.

 

హీరో, హీరోయిన్స్ ఎంపిక ఎలా జరిగింది … ??

నిజానికి మా స్టోరీ కి ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావాలి, అటువంటి పాత్రకి శ్రీరామ్ గారు అయితే కరెక్ట్ అనిపించింది. ఇక ఆయనతో నాకు దాదాపుగా పదేళ్లకు పైగా మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన పలు తమిళ సినిమాలకు నేను కెమెరా మ్యాన్ గా వ్యవహరించాను. సినిమాలో మంచి యాక్షన్ తో పాటు ఎమోషనల్ అంశాలు ఉండడంతో వాటికీ ఆయన సరిగ్గా పండించగలరనే నమ్మకంతో తీసుకున్నాము. షూటింగ్ లో మేము అనుకున్న దానికంటే పదిరెట్లు ఎక్కువ అవుట్ ఫుట్ ఇచ్చారు ఆయన. ఇక అవికా గోర్ ని తీసుకోవడానికి కారణం, సినిమాలో హీరోయిన్ పాత్ర మన పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండాలి, అలానే పాత్రలో మంచి ఎమోషన్, పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉంది. చిన్నపుడు చిన్నారి పెళ్లికూతురు సీరియల్ సమయంలోనే ఆ అమ్మాయి యాక్టింగ్ అదరగొట్టింది. అందుకే తను అయితే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నాం. తను కూడా సినిమాలో అద్భుతంగా నటించింది.

 

ఈలోపు మరొక సినిమాకి కూడా డైరెక్షన్ చేసినట్లున్నారు … ?

అనుకోకుండా మధ్యలో బుజ్జి ఇలా రా అనే మూవీకి జి నాగేశ్వర రెడ్డి గారు స్టోరీ, స్క్రిప్ట్ అందించడంతో పాటు ఆయనే స్వయంగా నిర్మించడానికి సిద్ధం అయి, నన్ను దర్శకత్వం చేయమన్నారు. టెన్త్ క్లాస్ డైరీస్ తరువాత ఆ సినిమా ప్రారంభం అయి మధ్యలో కరోనా వలన రిలీజ్ కొంత ఆలస్యం అయింది. ఈ మూవీ అనంతరం త్వరలో దానిని కూడా విడుదల చేస్తాం. అది కూడా చాలా మంచి సబ్జెక్టు. తప్పకుండ మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

 

ఇకపై డైరెక్షన్ చేస్తారా, లేక కెమెరా మ్యాన్ గా ఉండిపోతారు …. ??

నిజానికి మంచి కథ దొరికితే డైరెక్షన్ చేయడానికి రెడీ. అయితే దర్శకుడిగా నా మూడవ సినిమా రీమేక్ మూవీ చేయాలనుకుంటున్నాను. అది కుదురితే ఓకే, లేదంటే లేదు. ఇక ప్రస్తుతం ఒక మలయాళ మూవీకి కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నాను.

 

మీ టెన్త్ క్లాస్ మొమెంట్స్ ఈ టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ లో ఎన్ని పేజెస్ జోడించారు…. ??

నేను టెన్త్ క్లాస్ పూర్తి చేసిన పదేళ్ల అనంతరం సినిమా ఇండస్ట్రీ కి వచ్చేసాను. అలానే నాకు అప్పట్లో పెద్దగా జ్ఞాపకాలు కూడా లేవు. అయితే మధ్యలో సినిమా షూట్ చేస్తున్న సమయంలో అప్పటి క్లాస్ లో జరిగిన కొన్ని ఘటనలు, ఆ రోజులు కొంత గుర్తుకు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు