“విజయ్ 66” టైటిల్ కూడా ఆరోజేనా..?

Published on Jun 15, 2022 3:00 am IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లో ఒకరైనటువంటి దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ బై లాంగువల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా అభిమానులు అయితే ఈ సినిమా నుంచి విజయ్ బర్త్ డే ట్రీట్ గా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ జూన్ లోనే విజయ్ బర్త్ డే ఉండగా ఎప్పటి లానే తన సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుంది అని టాక్ అలాగే అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా యూనిట్ కూడా పాజిటివ్ గానే ఉండగా ఈ ఫస్ట్ లుక్ తోనే సినిమా టైటిల్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ ఇప్పుడు టైటిల్ లాక్ కాగా దీన్ని విజయ్ బర్త్ డే కానుకగా రివీల్ చేస్తారని తెలుస్తోంది. మరి దీనిపై అయితే ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :