అదిరే యాక్షన్ సీక్వెన్స్ లో థలా, యంగ్ హీరో కార్తికేయ!

Published on Oct 13, 2021 10:48 pm IST


కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా హుమాఖురేషి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి అప్డేట్ కి కూడా భారీ రెస్పాన్స్ రాగా ఇప్పుడు సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతున్నాయి. మామూలుగానే అజిత్ ఎలాంటి రేసరో అందరికీ తెలిసిందే.

తన స్కిల్స్ అంతటినీ సినిమాకి బాగా వాడేసినట్టుగా మొన్న వచ్చిన గ్లింప్స్ చూస్తేనే అర్ధం అయ్యింది. ఇక ఇప్పుడు సినిమాలో విలన్ గా నటిస్తున్న యంగ్ హీరో కార్తికేయతో కలిసి తమ రేసింగ్ బైక్స్ పై ఉన్న ఫోటో బయటకి వచ్చింది. దీనిని బట్టి వీరిద్దరి మధ్య అదిరే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

ఇప్పటికే కార్తికేయ కూడా రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో “గ్యాంగ్ లీడర్” లో కనిపించాడు. ఇక ఇప్పుడు ఏకంగా అజిత్ తో అంటే ఇక ఆ సన్నివేశాలు ఏ లెవెల్లో ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహించారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం :