టాక్..మరోసారి పవర్ఫుల్ రోల్ లో తలైవర్ రజినీ.?

Published on Feb 8, 2023 12:00 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో అయితే “జైలర్” అనే ఓ సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా మంచి అంచనాలు అయితే నెలకొనగా ఇక నెక్స్ట్ రజిని లైనప్ పై ఎప్పుడు నుంచో మంచి కూడా ఉంది. మరి ఈ లైనప్ లో అయితే ప్రముఖ దర్శకుడు టి జె జ్ఞ్యానవేల్ ముత్తు తో చేయనుండగా ఈ సినిమాపై మరో ఆసక్తికర బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది.

బహుశా ఈ సినిమాలో తలైవర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. తాను లాస్ట్ టైం దర్బార్ లో పోలీస్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ పోలీస్ స్టోరీ కి అయితే రజిని ఓకే చెప్పినట్టుగా టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక రజిని ప్రస్తుతం జైలర్ షూట్ లో బిజీగా ఉండగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :