ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో “దళపతి 67”.?

ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో “దళపతి 67”.?

Published on Feb 3, 2023 9:00 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించనున్న తన లేటెస్ట్ చిత్రంపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించనున్న ఈ చిత్రం సాలిడ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఓ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు మరింత స్థాయిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా స్టార్ట్ కావడం నుంచే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన మేకర్స్ నిన్ననే ఈ సినిమా టైటిల్ పై కూడా సాలిడ్ అప్డేట్ ని అందించారు.

ఈ టైటిల్ ఈరోజు రిలీజ్ కానుండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గెస్ లు ఈ టైటిల్ పై వినిపిస్తూ ఉండడం ఆసక్తిగా మారింది. అయితే ఈ టైటిల్ కే తో స్టార్ట్ అవుతుంది అని అలాగే ఆంగ్లం లో మొత్తం 7 అక్షరాలు ఉంటుంది అని ఓ సాలిడ్ హింట్ బయటకి రాగ దీనితో ఈ టైటిల్ “ఖైదీ 2” అంటూ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఈ టైటిల్ ఆల్రెడీ కార్తీ సినిమాతో ఉంది కానీ దీనికి కూడా లింక్ ఉండొచ్చు ఏమో అని ఓ పాజిటివ్ కోణం కూడా కనిపిస్తుంది. మరో టైటిల్ ఇదేనా లేక వేరే ఏమన్నా ఉందా అనేది తెలియాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు