ఊహించని బ్యాక్ డ్రాప్ లో “దళపతి 68”.!

Published on May 19, 2023 7:35 pm IST

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో అయితే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “లియో” చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం విజయ్ కెరీర్ లో అయితే 67వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇక విజయ్ కెరీర్ 68వ సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ దర్శకుడు వెంకట్ ప్రభు తో ఫిక్స్ కాగా ఈ చిత్రం పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని అయితే వెంకట్ ప్రభు విజయ్ కోసం ఓ ఊహించని బ్యాక్ డ్రాప్ ని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాడట.

ఒకవేళ విజయ్ తో సినిమా చేస్తే అది ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని ఇది ఆడియెన్స్ ని బాగా ఎగ్జైట్ చేసే పాయింట్ కాగా దీనిపై అయితే తాను విజయ్ కోసం స్టోరీ డెవలప్ చేస్తానని గతంలో చెప్పారట. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ముందుగా అధికారికంగా కన్ఫర్మ్ అయితే ఇదే బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే కోలీవుడ్ నుంచి యంగ్ హీరో శివ కార్తికేయన్ ఇదే ఎలియెన్ బ్యాక్ డ్రాప్ లో “అయలాన్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :