ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇపుడు పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న “జన నాయకన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఇది విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ముందు విజయ్ హీరోగా నటించిన సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.
అయితే తమిళ్ లో మంచి వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇటీవల అక్కడ టెలికాస్ట్ కి కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఇపుడు తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది. ఈ సినిమా టెలికాస్ట్ హక్కులు జీ తెలుగు సిటం చేసుకోగా అందులో త్వరలో టెలికాస్ట్ కి రానుంది. మరి విజయ్ సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ బుల్లితెరపై కూడా ఉంది. మరి గోట్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అలాగే దీనికి డేట్ కూడా ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.