“గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!

“గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!

Published on May 11, 2024 9:01 AM IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దర్శకుడు వెంకట్ ప్రభు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో విజయ్ ని డ్యూయల్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికీ చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ బిజినెస్ ని కూడా జరుపుకుంటుంది.

అయితే ఇప్పుడు విజయ్ యూఎస్ కి స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గోట్ లోని కొన్ని కీలక సన్నివేశాలు కోసం విజయ్ అండ్ టీం యూఎస్ వెళ్లారట. ఇక దీనితో పాటుగా విజయ్ ఆల్రెడీ సగానికి పైగా తన డబ్బింగ్ ని కూడా పూర్తి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు, అలాగే ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు