భారీ ధరకు విజయ్ 66 సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్.?

Published on Jan 29, 2022 5:04 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ ఇప్పుడు కోలీవుడ్ టాలెంటడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో “బీస్ట్” అనే సాలిడ్ యాక్షన్ డ్రామా చేసిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ సినిమాలతో పాటుగా తన గత సినిమాల నుంచి తెలుగులో కూడా మంచి మార్కెట్ పెంచుకుంటూ తాను వస్తున్నాడు. మరి వీటి తర్వాత ఫైనల్ గా డైరెక్ట్ తెలుగు మరియు తమిళ్ లో ఒక సాలిడ్ సినిమాని చెయ్యడానికి రెడీ కూడా అయ్యాడు.

తన కెరీర్ లో 66వ సినిమాగా దీనిని ప్లాన్ చెయ్యగా ఒక క్రేజీ గాసిప్ దీనిపై వినిపిస్తుంది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కూడా కాలేదు కానీ ఓ ప్రముఖ స్ట్రీమింగ్ మరియు నిర్మాణ సంస్థ ఈ చిత్రం తాలూకా నాన్ థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసేసినట్టు తెలుస్తుంది. మరి దీనికి గాను ఏకంగా 200 కోట్ల మేర ఆఫర్ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులకు పలికాయట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మాణం తెలిసిందే.

సంబంధిత సమాచారం :