టాక్..విజయ్ హిట్ డైరెక్టర్ తో అజిత్.?

Published on May 16, 2023 8:00 am IST

కోలీవుడ్ దగ్గర ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్ లో ఇళయ దళపతి విజయ్ మరియు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఈ కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి భారీ హిట్ అయ్యాయి. ఇక ఈ చిత్రాలు తర్వాత మరోసారి ఈ సాలిడ్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్టుగా బజ్ ఉండగా ఇప్పుడు అయితే మరో క్రేజీ బజ్ కోలీవుడ్ వర్గాల్లో అయితే వినిపిస్తుంది.

అట్లీ అయితే మొదటి సారిగా కోలీవుడ్ లో మరో బిగ్గెస్ట్ హీరో అజిత్ కుమార్ తో అయితే కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇపుడు అజిత్ చేయనున్న తన 62వ సినిమా తర్వాత అయితే 63వ సినిమాగా చేయనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ నిజంగా ఉందో లేదో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :