టాక్..”బీస్ట్” కోసం ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకోనున్న థలపతి.?

టాక్..”బీస్ట్” కోసం ఇంట్రెస్టింగ్ స్టెప్ తీసుకోనున్న థలపతి.?

Published on Jan 23, 2022 3:41 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ హీరోగా ప్రస్తుతం ఓ సాలిడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన చిత్రమే “బీస్ట్”. తన కెరీర్ లో “మాస్టర్” లాంటి భారీ సక్సెస్ ని అందుకున్న తర్వాత స్టార్ట్ చేసిన సినిమా ఇది కావడంతో బీస్ట్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాని కూడా విజయ్ తెలుగులో రిలీజ్ చేయనున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కోసం ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా కోసం తెలుగు లో మొట్ట మొదటి సారిగా విజయ్ తన డబ్బింగ్ తానే చెప్పుకోనున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఆల్రెడీ తాను దీని తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లితో ఫస్ట్ తెలుగు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అలా దానికి కూడా ఇది ఒక ప్రిపరేషన్ లా ఉంటుందని చెప్పాలి. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు