క్రేజీ యాక్షన్ కట్ తో అదిరిపోయిన విజయ్ “గోట్” ట్రీట్

క్రేజీ యాక్షన్ కట్ తో అదిరిపోయిన విజయ్ “గోట్” ట్రీట్

Published on Jun 22, 2024 7:06 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి నిన్నే మేకర్స్ విజయ్ బర్త్ డే కానుకగా రెండో సాంగ్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే దీనితో పాటుగా దర్శకుడు వెంకట్ ప్రభు మరో ట్రీట్ ని కూడా ఇస్తున్నట్లు తెలిపాడు.

అలా అర్ధ రాత్రి విజయ్ బర్త్ డే కానుకగా గోట్ యాక్షన్ కట్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా ఇది మాత్రం ఊహించని లెవెల్లో ఉంది అని చెప్పాలి. ఒక క్రేజీ ఛేజింగ్ సీక్వెన్స్ విజయ్ పై అందులో డ్యూయల్ రోల్ లో ఇద్దరు కనిపించడం జరిగింది. ఈ ఒక్క సీక్వెన్స్ సినిమాలో వేరే లెవెల్లో ఉండేలా ఉందని చెప్పాలి.

అలాగే తర్వాత ఫాస్ట్ గా వచ్చిన కట్స్ లో ఏదో ప్రయోగం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే యువన్ శంకర్ రాజా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో విజయ్ అభిమానులకి గట్టి ట్రీట్ నే ఇది ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాని ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5న సినిమా విడుదల కాబోతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు