తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న థమన్…ఎందుకంటే?

Published on Nov 11, 2021 3:41 pm IST

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ప్రముఖ సంగీతం దర్శకులు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలకి ఎక్కువ ఆదరణ లభించింది.

అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక చిన్న పిల్లాడు స్టూల్ తో భీమ్లా నాయక్ పాట కి డ్రమ్స్ వాయించినట్లు వాయిస్తున్నాడు. ఈ వీడియో కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రిప్లై ఇస్తూ, తన అందమైన కుర్చీ ను డ్రమ్మింగ్ సాధనం గా ఉపయోగించాలి అనే ఆలోచన తన చిన్ననాటి రోజులను గుర్తు చేసింది అని తెలిపారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భీమ్లా నాయక్ చిత్రం నుండి రిలీజ్ అయిన పాటలో సౌత్ ఇండియా నే షేక్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More