మహేష్ “సర్కారు వారి పాట” పై అదిరే అప్డేట్ ఇచ్చిన థమన్!

Published on Oct 17, 2021 11:02 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జీ. మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమా పై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ పై థమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనర్జీ టీమ్ తో స్పెయిన్ బార్సీలోన లో ఉన్నట్లు థమన్ తెలిపారు. అక్కడ సాంగ్ షూటింగ్ కోసం ఉన్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జీ ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. టీమ్ తో కలిసి ఉన్న ఫోటోను థమన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :

More