ఎన్టీఆర్ షోలో మహేష్ ప్రశ్న దగ్గర థమన్, దేవీ ల టెన్షన్ టెన్షన్.!

Published on Nov 5, 2021 1:00 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో ఎనర్జిటిక్ గా హోస్ట్ చేస్తున్న మరో గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. జెమినీ టీవిలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న ఈ షో లో నిన్న దీపావళి సందర్భంగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ థమన్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ లు స్పెషల్ గెస్టులుగా రాగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ఎపిసోడ్ మారింది. చాలా ఎంజాయ్ చేస్తూ ముగ్గురు సందడి చేసేసారు. అయితే ప్రశ్నలు దగ్గరకి వచ్చే సరికి వాళ్లకి కూడా టెన్షన్ తప్పలేదు.

ఓ ప్రశ్నలో ఈ హీరోస్ లో ఎవరు తమిళనాడులో పుట్టారు అనే ప్రశ్న దగ్గర వీళ్ళిద్దరినీ ఎన్టీఆర్ ఓ రేంజ్ లో టెన్షన్ పెట్టేసాడు. ఇందులో ఆప్షన్స్ గా అనీల్ కపూర్, రజినీ కాంత్, అజిత్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ల పేర్లు ఉండగా ఇక్కడ అజిత్ మహేష్ ల దగ్గర వీళ్ళకి వచ్చిన టెన్షన్ ఫిక్స్ చేసాక ఎన్టీఆర్ వాళ్ళని సస్పెన్స్ లో పెట్టిన విధానం కానీ ఆడియెన్స్ లో కూడా మంచి థ్రిల్ ఆ సమయంలో నెలకొంది. మొత్తానికి మాత్రం థమన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి డబ్బులు గెలుచుకున్నారు. కానీ మొత్తానికి మాత్రం మహేష్ దగ్గర ప్రశ్న వీళ్ళని ఓ రేంజ్ లో టెన్షన్ పెట్టింది.

సంబంధిత సమాచారం :