చెర్రీ-శ్రీనువైట్ల సినిమాకు థమన్ మ్యూజిక్

ram-charn-srinu-vatila
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న చిత్రంలో తాజాగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ సినిమాకు మొదటగా తమిళ సంచలన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. అయితే తాజాగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, ప్రస్తుతం ఈ సినిమా పట్ల పూర్తి శ్రద్ధ కనబరిచే స్థితిలో లేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఇక ఈ పరిణామాలతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తారా అన్న ఆసక్తి రేగింది. ఎట్టకేలకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది వెల్లడైంది. ఎస్.ఎస్. థమన్‌ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేశారు. ఈనెల 16న సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో ముగుస్తుంది. ఇక రెండో షెడ్యూల్‌ ఏప్రిల్ 2నుంచి మొదలుకానుంది. రామ్ చరణ్ రెండో షెడ్యూల్ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ మోహన్, కోనవెంకట్‍లు రచయితలుగా పనిచేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‍గా నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా విడుదల అవుతుందని నిర్మాతలు ఇంతకుముందే తెలియజేశారు.

Exit mobile version