“రాధే శ్యామ్” పై థమన్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

Published on Mar 6, 2022 8:04 am IST


ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న చిత్రాల్లో మొదటి సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంగీతం ఎంత వరకు ప్లస్ అయ్యిందో చూసాం. ఇంకా మొన్న వచ్చిన మేకింగ్ వీడియోలో మ్యూజిక్ అయితే మెస్మరైజ్ చేసేసింది. అయితే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న థమన్ లేటెస్ట్ పోస్ట్ పెట్టడం మరింత ఆసక్తిగా మారింది.

మా నుంచి ఒక క్రేజీయెస్ట్ స్కోర్ ని మీరు అంతా వినబోతున్నారని మున్ముందు మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ మీకోసం రాబోతున్నాయని. చాలా కాలం తర్వాత ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తాను ఇచ్చానని చెబుతున్నాడు. మరి అదెలా ఉంటుందో తెలియాలి అంటే జస్ట్ కొన్ని రోజులు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :