“దేవర” టీమ్ కి థమన్ బెస్ట్ విషెస్!

Published on May 19, 2023 9:12 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రానికి దేవర టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. నేడు ఈ చిత్రం టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చిత్ర యూనిట్ కి పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుతూ, సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

వావ్ తారక్ అన్న, ఇది చాలా పెద్దగా ఉండబోతుంది. నా బ్రదర్ అనిరుద్ రవి చందర్ దీన్ని కిల్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. టీమ్ మొత్తానికి గుడ్ లక్ తెలిపారు. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :