‘అఖండ 2’ సగానికే పైసా వసూల్ అంటున్న థమన్

‘అఖండ 2’ సగానికే పైసా వసూల్ అంటున్న థమన్

Published on Jan 23, 2025 12:00 AM IST

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సక్సెస్ వేడుకలు తాజాగా జరుపుకుంది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు బాబీ కొల్లి పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా బాలయ్య మరోసారి తన నటవిశ్వరూపంతో ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాడు. ఇక ఈ సినిమా సక్సెస్ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాలయ్య నెక్స్ట్ మూవీ ‘అఖండ 2’పై ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’ని ఎలా తెరకెక్కిస్తున్నాడో తనకి తెలుసని.. ఈ సినిమా మాస్ జాతరగా ఉండనుందని.. బాలయ్య మరోసారి అభిమానులకు ఫుల్ మీల్స్ పెడతాడని.. ఈ సినిమా ఇంటర్వెల్ వరకే ఆడియెన్స్‌కు పైసా వసూల్ చేసేలా ఉంటుందని థమన్ కామెంట్ చేశాడు.

ఇలా ‘అఖండ 2’ మూవీపై థమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని బోయపాటి తీవ్రంగా కష్టపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు