పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఓజి’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, తాజాగా ‘ఓజి’ చిత్రానికి థమన్ అందించే మ్యూజిక్‌పై ఆయన తాజాగా స్పందించారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని.. ఈ మ్యూజిక్ రిలీజ్ అయ్యేసరికి తాను గడ్డం, మీసం పెంచుకుంటానని.. ఈ చిత్ర మ్యూజిక్ రిలీజ్ తర్వాత తాను మీసం మెలేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం సుజిత్ అండ్ టీమ్ ఎంతో కష్టపడుతున్నారని.. దీని ఔట్‌పుట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఆయన అన్నారు.
ఇక ఈ సినిమాలో పవన్ లుక్స్ పరంగా కూడా ప్రేక్షకులను స్టన్ చేస్తారని.. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.