“భీమ్లా” పై ఓ రేంజ్ హైప్ ఇస్తున్న థమన్ లేటెస్ట్ స్టేట్మెంట్.!

Published on Jan 23, 2022 12:55 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో అభిమానుల్లో చాలా క్రేజీగా ఎదురు చూస్తున్నా సినిమా ఏదన్నా ఉంది అంటే అది “భీమ్లా నాయక్” అనే చెప్పాలి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం మాంచి హైప్ తో ఇప్పుడు ఉంది. అన్ని సెట్టయ్యి ఉంటే ఈ జనవరిలో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కి సంగీతం అందిస్తున్న థమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. అయితే ఈ కామెంట్స్ మాత్రం ఈ సినిమాపై మరింత హైప్ ఎక్కించేలా ఉన్నాయని చెప్పాలి. తాను మరియు త్రివిక్రమ్ ఇప్పటివరకు భీమ్లా నాయక్ రష్ అవుట్ పుట్ చూసామని ఒక్క మాట అయితే చెప్పగలను ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

అంతేకాకుండా తన వల్ల అయ్యినది అంతా కూడా ఈ సినిమా కోసం చేసానని కూడా తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ పవన్ అభిమానుల్లో మరింత హై ని ఇస్తున్నాయి. మరి ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాని సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :