“డాకు మహారాజ్” పై థమన్ సాలిడ్ రివ్యూ వైరల్

“డాకు మహారాజ్” పై థమన్ సాలిడ్ రివ్యూ వైరల్

Published on Jan 11, 2025 8:06 AM IST

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రం “డాకు మహారాజ్” కూడా ఒకటి. సాలిడ్ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ముందు బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి అలాగే భగవంత్ కేసరి సినిమాలతో భారీ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ డాకు మహారాజ్ తో డెఫినెట్ గా రెండో హ్యాట్రిక్ కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి దీనిపై లేటెస్ట్ గా తన హ్యాట్రిక్ సినిమాలకి వర్క్ చేసిన థమన్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.

కోలీవుడ్ లో అనిరుద్ తన హీరోల సినిమాలకి ఎలా పోస్ట్ లు చేస్తాడో ఇపుడు థమన్ కూడా చేస్తున్నాడు. మరి ఇలా బాలయ్యతో రెండో హ్యాట్రిక్ ని డాకు మహారాజ్ తో స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపాడు. జై బాలయ్య అంటూ విన్ అవుతున్నట్టుగా అనిరుద్ మార్క్ లోనే కొన్ని ఎమోజిస్ పెట్టి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. దీనితో తన రివ్యూ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు