‘గేమ్ ఛేంజర్’ విషయంలో థమన్ డబుల్ స్టాండర్డ్స్!

thaman game changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోని సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి రిలీజ్ కి ముందు వరకు దర్శకుడు శంకర్ సహా మిగతా టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాలో పలు హైలైట్స్ ని గట్టిగా లేపారు.

మరి వీరిలో సంగీత దర్శకుడు థమన్ కూడా ఉన్నాడు. అయితే ఇపుడు థమన్ అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పడం అనేది ఆసక్తిగా మారింది. సినిమా రిలీజ్ కి ముందు సినిమాలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని మెయిన్ గా జరగండి సాంగ్ ఒక్క దానికే ఆడియెన్స్ పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయి అని తాను తెలిపాడు. కానీ రీసెంట్ పాడ్ కాస్ట్ లో తన కామెంట్స్ ఊహించని రకంగా మారాయి.

గేమ్ ఛేంజర్ సాంగ్స్ అంత హిట్ కాకపోవడానికి కారణం ఒక్క సాంగ్ లో కూడా సరైన హుక్ స్టెప్ లేదని అల వైకుంఠపురములో సినిమాకి ప్రతీ సాంగ్ లో ఒక హుక్ స్టెప్ ఉంది. కానీ గేమ్ ఛేంజర్ కి అలాంటివి లేవు అంటూ సినిమా రిజల్ట్ పై ఈ అంశాలు ఆపాదించడం చేసాడు. దీనితో రిలీజ్ ముందు అన్ని మాటలు మాట్లాడి ఇపుడు ఇలా కామెంట్స్ చేయడంపై తనపై సోషల్ మీడియాలో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version