బాలయ్య ఫ్యాన్స్ కి సూపర్ అప్ డేట్ అందించిన థమన్

Published on Sep 21, 2023 11:00 pm IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పవర్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీలీల ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసందే.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ యొక్క బీజీఎమ్ వర్క్ స్టార్ట్ అయిందని, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీతో థియేటర్స్ మోత మ్రోగిపోవడం ఖాయం అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో తాజాగా థమన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా థమన్ పెట్టిన పోస్ట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ నుండి మరొక సాంగ్ ని రిలీజ్ చేసేందుకు భగవంత్ కేసరి టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :