“రాధే శ్యామ్” ట్రైలర్ పై క్లారిటీ ఇచ్చిన థమన్ ఎస్.!

Published on Dec 23, 2021 1:00 pm IST

ఇప్పుడు పాన్ ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. మరి ఈరోజు పెద్ద ఎత్తున జరగబోతున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని కూడా మేకర్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇదే ఈవెంట్ తో రాధే శ్యామ్ రిలీజ్ చెయ్యబోతున్న ట్రైలర్ పై సంగీత దర్శకుడు థమన్ థమన్ ఒక క్లారిటీ ఇచ్చాడు. గత కొన్ని రోజులు నుంచి థమన్ ఈ సినిమా ట్రైలర్ కి గాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నట్టుగా అదే ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని గాసిప్స్ వచ్చాయి.

మరి దానికి థమన్ ఈరోజు ట్రైలర్ రిలీజ్ కి క్లారిటీ ఇచ్చాడు. తాను నేను ఏ థియేట్రికల్ ట్రైలర్ కి మ్యూజిక్ అందివ్వట్లేదు అని అలాగే రాధే శ్యామ్ కి కూడా చెయ్యలేదు అని అందరికీ కన్ఫర్మ్ చేసి చెప్పాడు. సో రాధే శ్యామ్ పై ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ వచ్చినట్టేగా.

సంబంధిత సమాచారం :