“అఖండ” ఫస్ట్ సింగిల్‌పై హింట్ ఇచ్చేసిన తమన్..!

Published on Sep 15, 2021 11:32 pm IST


నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “అఖండ”. ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ హింట్ ఇచ్చేశాడు.

ఈ సినిమా బీజీఎం వర్క్స్ నేటి నుంచి ప్రారంభించబోతున్నానని తెలిపాడు. అంతేకాదు అఖండ ఫస్ట్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రాబోతుందని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబో మరోసారి అదిరిపోవాలని అన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ అవుతుందని తొలుత బజ్ వినిపించినా ఇప్పుడు ఆ డేట్ కాస్త మారిందన్న ప్రచారం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :