లేటెస్ట్ : థమన్ ఖాతాలో పలు క్రేజీ ప్రాజక్ట్స్

Published on Jun 11, 2023 1:00 am IST

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవల అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అలవైకుంఠపురములో మూవీ భారీ సక్సెస్ తో పాటు అందులోని సాంగ్స్ నేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం తో అందరిలో బాగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి థమన్ కు బాగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాలకు వర్క్ చేసిన థమన్ చేతిలో కొన్ని భారీ ప్రాజక్ట్స్ ఉన్నాయి.

వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న బ్రో, ఓజి సినిమాలు, బాలయ్య తో అనిల్ రావిపూడి తీస్తున్న భగవంత్ కేసరి, రామ్ చరణ్ శంకర్ ల గేమ్ చేంజర్, ప్రభాస్ మారుతీల మూవీ, రామ్ బోయపాటి ల మూవీ, అలానే వీటితో పాటు మరికొన్ని ఇతర ప్రాజక్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా పలు క్రేజీ ప్రాజక్ట్స్ తో కెరీర్ పరంగా ధూమోసుకెళ్తున్న థమన్ వీటితో కనుక మరిన్ని సక్సెస్ లు సొంతం చేసుకుంటే ఆయన పేరు, క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం :