“సర్కారు వారి పాట”కి కూడా అదే మ్యాజిక్ హై ఇస్తున్న థమన్.!

Published on Apr 1, 2022 3:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే వెరీ స్టైలిష్ అండ్ మాస్ గా తెరకెక్కుతుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ట్రీట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన రెండు సాంగ్స్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి.

అయితే ఇటీవల కాలంలో థమన్ సినిమాలకి అదిరే పాటలతో పాటు ఆ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఒక కంప్లీట్ సోల్ లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా ఇచ్చి మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని మహేష్ సర్కారు వారి పాట కి కూడా రిపీట్ చేస్తున్నట్టు చిన్న వీడియో క్లిప్ ని వదిలాడు.

ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులని స్టార్ట్ చేసినట్టుగా చిన్న బిట్ వినిపించాడు. అయితే ఇది మాత్రం చాలా ప్లెజెంట్ గా ఉందని చెప్పాలి. దీనితో ఇది విన్నాక ప్రతి ఒక్కరికీ మంచి హై వస్తుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :