“రాధే శ్యామ్” కి అదరగొట్టేస్తున్న థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.!

Published on Mar 4, 2022 7:46 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సహా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర సంగీత దర్శకుడు థమన్ హవా నడుస్తుందని చెప్పాలి. తాను ఎప్పుడైతే దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసాడో అక్కడ నుంచి ఓ కొత్త థమన్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. మరి అలా ఇప్పటి వరకు ప్రతి సినిమాకి కూడా వైవిధ్యంగా తనలోని బెస్ట్ ని ఇస్తూ ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు.

ముఖ్యంగా తన సాంగ్స్ కన్నా తాను ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ లకి అనూహ్య స్పందన వస్తుంది. అందుకే పలు సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా తమ సినిమాలకి నిర్మాతలు చేయించుకుంటున్నారు. అలా తాను చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నే “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఈ భారీ సినిమాకి థమన్ ని చిత్ర యూనిట్ లాస్ట్ మినిట్ లో తీసుకొని మరింత గ్రాండియర్ ని తీసుకొచ్చారు.

అయితే ఈ సినిమాకి థమన్ ఎలాంటి స్కోర్ ఇస్తున్నాడో లేటెస్ట్ గా ఒక వీడియో పెట్టాడు. అందులో రాధే శ్యామ్ బ్యాక్గ్రౌండ్ విన్నట్టయితే “రాధే శ్యామ్” బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేస్తున్నాడని చెప్పాలి. మరి సినిమాలో విజువల్ గా అది ఎలా ఉంటుందో అని థమన్ అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఇక అది తెలియాలి అంటే ఈ మార్చ్ 11 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :