ప్రభాస్ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్ మ్యూజిక్ ఇచ్చేందుకు థమన్ సిద్ధం.!

Published on Mar 12, 2022 9:15 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది. భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా వాటికి తగ్గట్టు గానే భారీ రెస్పాన్స్ ని మొదటి అన్ని చోట్లా అందుకొని అదరగొట్టింది.

అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని హైలైట్స్ లో ప్రేక్షకులు అంతా ఈ సినిమా తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానిని ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కోసం మాట్లాడుకుంటున్నారు. అనేక చోట్ల థమన్ ఇచ్చిన స్కోర్ చాలా బాగుందని అంటున్నారు.

అయితే లేటెస్ట్ గా థమన్ ప్రభాస్ సినిమాకి గాను పూర్తి స్థాయి సంగీతం అందివ్వనున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. దర్శకుడు మారుతీ తో ప్రభాస్ చేయనున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి థమన్ ఫైనల్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే బ్యాలన్స్ ఉంది.

సంబంధిత సమాచారం :