సర్కారు వారి ‘పాట’ పై ఎగ్జైట్మెంట్ పెంచుతున్న థమన్.!

Published on Oct 28, 2021 4:00 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. అలాగే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంకి ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్న సంగీత దర్శకుడు థమన్ సాలిడ్ ట్యూన్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా అందిస్తున్నాడు.

మరి ఈ సినిమా ఆల్బమ్ పట్ల కూడా చాలా అంచనాలు ఉండగా వాటికి ఏమాత్రం తీసిపోకుండా థమన్ ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్స్ ఇస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా మ్యూజికల్ వర్క్స్ లో బిజీగా ఉంటూ ఓ ఫోటోని షేర్ చేసుకొని “డ్రమ్మింగ్, హమ్మింగ్, కుమ్మింగ్” అంటూ సాలిడ్ హైప్ ఎక్కిస్తున్నాడు.

దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ ఆల్బమ్ పై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ ట్యూన్ ని చిత్ర యూనిట్ దీపావళి కానుకగా రిలీజ్ చేయనుంది అని స్ట్రాంగ్ బజ్ ఉంది. సో అప్పుడు వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :