“సర్కారు వారి పాట” పెన్నీ సాంగ్ పై హైప్ ఎక్కిస్తున్న థమన్!

Published on Mar 19, 2022 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరోపక్క మేకర్స్ ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ కళావతి ఆల్రెడీ సెన్సేషన్ ని నమోదు చెయ్యగా రెండో పాటగా “పెన్నీ” ని అనౌన్స్ చేసాక మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే ఈ సాంగ్ కోసం లేటెస్ట్ గా థమన్ తన ట్విట్టర్ ద్వారా మాట్లాడాడు. ఈ పెన్నీ సాంగ్ కి మాత్రం తాను తన యూనిట్ చాలా అంటే చాలా కష్టపడ్డాం అని.

కానీ సాంగ్ మాత్రం ఫైనల్ గా అదిరిపోయే లెవెల్లో వచ్చింది అని ప్రతి ఒక్కరికీ సాంగ్ సూపర్ గా నచ్చుతుంది అని పక్కాగా చెబుతున్నాడు. ఈ మార్చ్ 20 వస్తున్న ఈ సాంగ్ కూడా మంచి హిట్ అవుతుందని ఓ రేంజ్ లో హైప్ ఎక్కించాడు. దీనితో ఈ ఆడియో మహేష్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ కిక్ ఇస్తుంది.

సంబంధిత సమాచారం :