“మహేష్ 28″తో కొత్త రికార్డులు మొదలు..థమన్ పోస్ట్ వైరల్.!

Published on Jun 16, 2022 10:04 am IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” చిత్రంతో తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ని అందులో మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి గేట్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ తన దర్శకుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో 28వ సినిమాగా హ్యాట్రిక్ చిత్రం చేస్తున్నారు.

మరి ఇంకా షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ మరియు మ్యూజికల్ సిట్టింగ్స్ లో ఉంది. అలాగే మహేష్ కి కూడా పూర్తి స్క్రిప్ట్ వినిపించనుండగా సంగీత దర్శకుడు థమన్ పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ లో తాను మరియు త్రివిక్రమ్ ఉన్న పిక్ షేర్ చేసుకొని మా కొత్త జర్నీ తో సరికొత్త రికార్డ్స్ మొదలు అంటూ మహేష్ సినిమాపై పోస్ట్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :