‘సర్కారు వారి’ ఆల్బమ్ పై థమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Nov 6, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ అండ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ పెట్ల నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అన్ని రకాలుగా కూడా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ మరియు థమన్ ల కెరీర్ లో ట్రెండ్ సెట్టింగ్ ఆల్బమ్స్ ఉన్నాయి.

దీనితో ఈసారి ఇంకా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. మరి ఈ ఆల్బమ్ పైనే తన పెట్టిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సినిమా ఆల్బమ్ నా హృదయానికి చాలా దగ్గరైనది. దీనికోసం ఏ రోజైనా తగ్గకుండా వర్క్ చేస్తానని అలాగే సినిమా రిలీజ్ డేట్ పరంగా అప్డేట్స్ ఉంటాయని ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా మన సూపర్ స్టార్ కోసం చేస్తున్న ఈ ఆల్బమ్ చాలా స్పెషల్ గా ఉంటుందని థమన్ అంటున్నాడు.

సంబంధిత సమాచారం :