లేటెస్ట్ : త్రివిక్రమ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన థమన్

Published on Feb 2, 2023 2:10 am IST


టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి అద్భుతమైన సాంగ్స్ ని అందిస్తూ ఆడియన్స్ నుండి సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న థమన్, కెరీర్ బిగినింగ్ నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి పై కొచ్చారనే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అలవైకుంఠపుములో మూవీతో ఏకంగా జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా సొంతం చేసుకున్న థమన్ చేతిలో ప్రస్తుతం పలు బడా సినిమాలు ఉన్నాయి. ఇటీవల సంక్రాంతి కానుకగా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీరసింహారెడ్డి తో పాటు, విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వరిసు మూవీస్ భారీ సక్సెస్ తో మరింత జోష్ లో ఉన్నారు థమన్.

అయితే నేడు ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా తన సినీ కెరీర్ గురించి పలు విషయాలు వెల్లడించిన థమన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. నిజానికి తన లైఫ్ చూసుకుంటే త్రివిక్రమ్ గారితో పరిచయానికి ముందు, అలానే ఆయనతో పరిచయం తరువాత అని చెప్తానని అన్నారు. ముఖ్యంగా ఆయన తన లైఫ్ లో బెస్ట్ పర్సన్ అని అన్నారు. అలానే అయనతో పనిచేసిన అరవింద సమెత మూవీ వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆ సినిమా కోసం ఎంతో ప్రాణం పెట్టానని, ఆ తరువాత వచ్చిన అలవైకుంఠపురములో మూవీస్ సాంగ్స్ అవుట్ పుట్ కూడా అంత అద్భుతంగా రావడానికి కారణం త్రివిక్రమ్ గారే అని అన్నారు. ఇక ప్రస్తుతం ఆయనతో మహేష్ బాబు హీరోగా చేస్తున్న SSMB 28 మూవీ సాంగ్స్ పై కూడా గట్టిగా దృష్టి పెట్టానని, తప్పకుండా అది కూడా పెద్ద సక్సెస్ఫుల్ ఆల్బమ్ అవుతుందని అన్నారు థమన్.

సంబంధిత సమాచారం :