పవన్ – సాయి ధరమ్ తేజ్ మూవీ అప్డేట్ పై థమన్ పోస్ట్ వైరల్!

Published on May 18, 2023 12:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఒక చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం 4:14 గంటలకు విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ అప్డేట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజికల్ సెన్సేషన్ థమన్ తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక పోస్ట్ ను షేర్ చేశారు.

సాయంత్రం 4:14 గంటలకు ఫైర్ అంటూ చెప్పుకొచ్చారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉండే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమా పై మంచి హైప్ ఉంది. అంతేకాక విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ నటిస్తున్న సినిమా కావడం తో అందరి చూపు ఈ చిత్రం పైనే ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :