లేటెస్ట్ : ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ పై థమన్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

లేటెస్ట్ : ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ పై థమన్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Nov 22, 2022 11:55 PM IST


టాలీవుడ్ నటసింహం బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ప్రతిష్టాత్మక మాస్ యాక్షన్ మూవీ వీరసింహా రెడ్డిలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ అనౌన్స్ మెంట్ మోషన్ పోస్టర్ అన్ని కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఎరిపరిచాయి. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే మ్యాటర్ ఏమిటంటే, 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుండి త్వరలో వరుసగా అప్ డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది యూనిట్. అతి త్వరలో వీరసింహా రెడ్డి నుడి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది అంటూ కొద్దిసేపటి క్రితం థమన్ తన ట్విట్టర్ ద్వారా బాలయ్య ఫ్యాన్స్ కి మంచి న్యూస్ చెప్పడంతో పాటు మూవీ పై మరింతగా హైప్ పెంచేశారు అని చెప్పాలి. కాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో వర్క్ చేసిన అఖండ మూవీకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అదరగొట్టడంతో వీరిద్దరి లేటెస్ట్ కాంబో మూవీ వీరసింహా రెడ్డి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు