ప్రభాస్ సినిమాకు థమన్ రీ రికార్డింగ్

ప్రభాస్ సినిమాకు థమన్ రీ రికార్డింగ్

Published on Dec 26, 2021 10:04 PM IST

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ బయటికి వచ్చింది.

రాధే శ్యామ్ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ఆర్ అందించబోతున్నారు. ఈయనే సినిమాకు రీ రికార్డింగ్ అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రేమను వెతుక్కుంటూ హీరో చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆల్ ఇండియా రికార్డులను బద్ధలుకొడుతుంది. అత్యద్భుతమైన విజువల్స్ అందులో కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. థమన్ ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణ. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సంగీతం అందిస్తున్నారు. మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీ లో సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, జగపతిబాబు, మురళి శర్మ, జయరాం, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె కె రాధాకృష్ణ కుమార్ అందిస్తుండగా, జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు