శివ కార్తికేయన్ కొత్త చిత్రానికి థమన్ సంగీతం!

Published on Jan 6, 2022 12:40 pm IST


వరుస సినిమాలతో తమిళ నాట సెన్సేషన్ హీరోగా మారిపోయారు శివ కార్తికేయన్. శివ కార్తికేయన్ ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జాతి రత్నాలు చిత్రం తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు శివ కార్తికేయన్ తో సినిమా చేస్తుండటం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ఎలా ఉండనుంది అనే దాని పై ఇండస్ట్రీ లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎంటర్ అవ్వడం జరిగింది. థమన్ రాక తో సినిమా మరో రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ చిత్రం లో టాలీవుడ్ నటుడు నవీన్ పోలిశెట్టి సైతం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :