“అఖండ” హై లెవెల్ మాస్ వర్క్ లో థమన్.!

Published on Nov 23, 2021 8:00 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలతో అన్ని విధాలా అదిరే లెవెల్లో తెరకెక్కించారు.

మరి అదే విధంగా ఈ సినిమా పాటలను కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ మేకర్స్ ఎక్కడా కూడా రాజీ పడట్లేదు. సంగీతం దర్శకుడు థమన్ నుంచి ఈ సినిమా థీమ్ కి తగ్గ సంగీతాన్ని రాబట్టినట్టు ఆల్రెడీ ఓ క్లారిటీ రాగా ఇప్పుడు తాజాగా థమన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాకి అది సాంగ్ నో లేక బ్యాక్గ్రౌండ్ స్కోర్ నో కానీ ఏకంగా 126.9 హై లెవెల్ బేస్ లో కంపోజ్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అది వినడానికి కూడా మంచి హై ఇచ్చే లెవెల్లో మాసివ్ గా ఉంది. దీనితో తన వర్క్ సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి అది విట్నెస్ చెయ్యాలి అంటే వచ్చే డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :