“సర్కారు వారి పాట”పై కన్ఫ్యూజన్ లో పెట్టేసిన థమన్..?

Published on Jan 21, 2022 8:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న ఆల్ మోస్ట్ అన్ని సినిమాల నుంచి కూడా వాటి తాలూకా పాటలు వచ్చిన సంగతి చూస్తున్నాము. తక్కువలో తక్కువ ఒక్క సాంగ్ అయినా అన్ని ముఖ్య సినిమాలు నుంచి వచ్చాయి. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ “సర్కారు వారి పాట” ఆల్బమ్ కూడా మంచి మోస్ట్ అవైటెడ్ గానే మిగిలిపోయింది. సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఈ ఆల్బమ్ లో మొదటి పాట కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఇప్పటికే రావాల్సి ఉంది కానీ మేకర్స్ ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ అప్డేట్ ని అందివ్వలేకపోయారు. మరి లేటెస్ట్ గా థమన్ టీజ్ చేస్తూ పెట్టిన ట్వీట్ తో మాత్రం మహేష్ అభిమానులు కాస్త కన్ఫ్యూజన్ లో పడ్డారని చెప్పాలి. వచ్చే ఫిబ్రవరి 14 న అంటే ప్రేమికుల దినోత్సవం రోజున అన్నట్టుగా ఒక డేట్ ని పెట్టి వదిలేసాడు.

అయితే ఇది సాంగ్ కోసమే అని అందరికీ అర్ధం అవుతుంది కానీ అసలు ఏ సినిమా సాంగ్ అనేది అర్ధం కాలేదు. దీనితో ఎలాగో సర్కారు వారి పాట నుంచే పాటలు రావాల్సి ఉంది కాబట్టి ఇది ఆ సినిమా నుంచే అని అంతా అనుకుంటున్నారు. కానీ అదైతే పక్క గంట ఎమోజి కూడా పెట్టి ఉండేవాడు మరి అసలు థమన్ ఏ సినిమాపై డేట్ ని పెట్టాడో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :