ప్రభాస్ సినిమాను ఆ రీజన్ వల్లే వదిలేశా – తమన్

Published on Nov 26, 2021 3:10 am IST


ప్రస్తుతం టాలీవుడ్‌లో తమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతగాడి చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోల అందరి సినిమాల కోసం పనిచేస్తున్న తమన్ ఇప్పటివరకు ప్రభాస్ సినిమాకు మాత్రం మ్యూజిక్ అందించేలేదు. అయితే వీరి కాంబో ఎప్పుడుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్ ఇంతకు ముందు ప్రభాస్ “రెబల్” సినిమా నుంచి తానే తప్పుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన లారెన్స్ సంగీతం కూడా స్వయంగా అందించాలి అనుకున్నారు. దీంతో చేసేదేమి లేక నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నానని అన్నారు. అయితే భవిష్యత్తుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభాస్‌తో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :